Our greatest glory is not never FAILING but in RISING every time
we FALL.

సమస్యలతో ఎలా వ్యవహరించాలి

మనం భూమి మీదకి ప్రతీ అనుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తూ ఆనందంగా జీవించడానికే వచ్చాం. జ్ఞానం అనంతం. దీనిని మన పాత పద్ధతుల ద్వారా కాకుండా కొత్త పద్ధతుల్లో పయనించినప్పుడే పొందగలం. అప్పుడే మన జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. నిజానికి మనమందరం సృష్టికర్తలం. మన సృష్టి అంతా మన అంతరంలోనే జరుగుతోంది. మన సమస్యలకు పరిష్కారాన్ని మనం ఇప్పటి వరకూ బాహ్యంగా వెతుకుతూ వచ్చాం. కాని మన సమస్యలకు పరిష్కారాన్ని అంతర్ ప్రయాణం చేసి, రాగ-ద్వేషాలకతీతంగా చేరి, అంతర్వాణి మాట విని దానిని ఆచరించినప్పుడే మనం ఫలితాలను పొందగలం. కర్మ, తలరాత, నేనేమి చెయ్యలేను... అని నిరాశ చెందకుండా నా జీవితం నా చేతుల్లోనే ఉంది, నా జీవితానికి నేనే బ్రహ్మను అనే విశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే ఆత్మస్థితికి చేరుతూ అనంతమైన జ్ఞానాని, ఆనందాన్ని పొందుతాం. నిజానికి మన సమస్యలే మన గురువులు. ఇది ఒక సరికొత్త పద్ధతి.

న్యూ ఎనర్జీ కాన్సెప్ట్‌ని విని ఫాలో అవ్వడం ద్వారా ఈ క్రింది విషయాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు...

1. మనకు మనమే డాక్టర్లం, గురువులం, సృష్టికర్తలం అని అనుభవపూర్వకంగా తెలుసుకోగలం.

2. మన అంతరంలోని భయాలను ప్రేమతోటి స్వీకరిస్తూ వాటి ద్వారా పయనించినప్పుడే మన దివ్యత్వాన్ని సొంతం చేసుకోగలం.

3. కష్ట-సుఖాలను సమంగా స్వీకరించగలం. అంటే సమస్యలను ద్వేషించకుండా వాటిని గురువుగా భావించి, వాటి సహాయంతోనే పరిష్కారం వైపుకు పయనిస్తాం.

4. ఈ కాన్సెప్ట్ ద్వారా మన నిత్యజీవితంలో ఎదురయ్యే విద్య, ఆర్ధిక, బాంధవ్య, శారీరక, మానసిక, ఆధ్యాత్మికపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పొందుతాం.

5. గతాన్ని సంపూర్ణంగా హీల్ చేసుకోవడంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉందనే విషయాన్ని తెలుసుకోగలం.

6. ‘యద్భావం తద్భవతి’ – అంటే మన నమ్మకాలే మన జీవితాన్ని నడిపిస్తున్నాయి, కాబట్టి మన నమ్మకాలు మారినప్పుడే మన జీవితం కూడా మార్పు చెందుతుందని తెలుసుకుంటాం.

7. మనం రాగ-ద్వేషాలకతీతంగా చేరి, మంచి-చెడుల మధ్య యుద్ధం కాకుండా శాశ్వతమైన ప్రేమను సృష్టిస్తూ, ఆ రెండింటిని సంపూర్ణంగా కలిపి గుణాతీత స్థితికి చేరి ముక్తిని పొందుతాం.

న్యూ ఎనర్జీ క్లాసెస్ మరియు కౌన్సిలింగ్స్‌కు సంప్రదించండి: P.SREEDHAR – 9390151912. PRASANNA – 9032431443. GAYATRI – 9160511656.