పిల్లలు
హాయ్ ఫ్రెండ్స్,
నేను ఇప్పుడు మీకు ఆనందిస్తూ చదవాలంటే ఎం చేయాలి, అలాగే మీకు వచ్చే చిన్న చిన్న సమస్యలని ఎలా డీల్ చేయాలనేది చెప్తాను. మామూలుగా మీరు ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు వరకు చదువుతూ ఉంటారు. కానీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చదివినది మరిచిపోతూ ఉంటారు కదా! చాలాసార్లు మరిచిపోయాం అని బాధపడతారు కదా. సో మతిమరుపు ఉండాలా, వద్దా? అందరూ ఉండకూడదు అంటారు. ఈ అభిప్రాయం సరైనదేనా! ఒకసారి మీరే ఆలోచించండి.
కానీ నేను అంటాను మనిషికి ఖచ్చితంగా మతిమరుపు ఉండాలని. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ఎప్పుడో మీ టీచర్ కొట్టినది, లేదా మరేదైనా విషయమో లేదా వేరే ఏ సబ్జెక్టైనా గాని గుర్తొంచిందనుకోండి, అంటే ఇంగ్లీషు ఎగ్జామ్ రాసేప్పుడు హిందీ గుర్తుకు వచ్చిందనుకోండి, మీరు ఎగ్జామ్ సరిగా రాయగలరా? రాయలేరు.
మీ మైండ్‌లో - చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మంచి-చెడుకి సంబంధించిన అన్ని విషయాలు స్టోర్ అయ్యి ఉంటాయి. అవన్నీ మీకు గుర్తుకు వస్తే ఎగ్జామ్ రాయలేరు. కనుక అవసరమైనవి మాత్రం గుర్తుకురావాలి, అనవసరమైనవి మరిచిపోవాలి. అవునా? కాదా? నిజానికి మతిమరుపు చెడ్డది కాదు. మనిషికి ప్రతీరోజూ మతిమరుపు అవసరం చాలా ఉంటుంది. దాని గురించి ప్రాక్టికల్‌గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఉదాహరణకు- నా క్లాస్ వింటున్నారు మీరు. నా క్లాస్ వినడానికి మతిమరుపు కావాలా? జ్ఞాపకశక్తి(మెమరీపవర్) కావాలా? చాలా మంది జ్ఞాపకశక్తి కావాలి అని అంటారు. కాని నేనేమంటానంటే మీకు మతిమరుపు లేకుంటే నా క్లాస్ వినలేరని. నేను క్లాస్ చెబుతున్నప్పుడు, మీలో ఒక పార్ట్ న్యూట్రల్‌గా వినాలి, ఇంకో పార్ట్ విన్నది స్టోర్ చేయాలి, మరో పార్ట్ స్టోర్ అయినది గుర్తుకు రాకుండా తాత్కాలికంగా మరచిపోయేలా చేయాలి. ఇలా 3 సమన్వయంతో మీ లోపల పని చెయ్యాలి. అప్పుడే మీరు నా క్లాస్ వినగలుతారు.
కనుక మీకు మతిమరుపు 24 గంటలు ఉండాలి, మెమరీపవర్ 24 గంటలు ఉండాలి, న్యూట్రల్ కూడా 24 గంటలు ఉండాలి. ఎందుకంటే మీరెప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కనుక దానికి సంబంధించినవి గుర్తుకు రావాలి మిగతావి గుర్తుకురాకూడదు. కనుక ఈ 3 మీ లోపల ఎప్పుడూ సమానంగా పని చెయ్యాలి. కనుక మీరు partiality చూపించకుండా, వీటిని సమానంగా స్వీకరించాలి. అంటే వినడం(న్యూట్రల్-33.33%), మరిచిపోవడం(నెగెటివ్-33.33%), జ్ఞాపకశక్తి(పాజిటివ్-33.33%). 24 గంటలు ఈ 3 ఎనర్జీస్ మీ లోపల పని చేస్తూనే ఉండాలి. అంటే 24 గంటలు ఈ మూడింటి సపోర్ట్ మీకు ఉండాలి.
కానీ ఒక్క మతిమరుపే ఉంటే, మీరు అన్ని మరిచిపోతారు, మీ పేరు కూడా మరిచిపోతారు. పోనీ ఒక మెమరీ పవర్ ఉన్నా కూడా అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఎల్లప్పుడు అన్నీ గుర్తుకు వస్తే మీరు ఇబ్బంది పడతారు. దీని వలన నిద్ర కూడా సరిగా రాదు. కనుక ఆ పనికి అవసరమైనవి కాకుండా అనవసరమైనవి గుర్తుకు వస్తే, రిమిక్స్-జిమిక్స్ అయ్యి మీరు గందరగోళంలో పడిపోతారు. అలా కాకుండా మతిమరుపు, మెమరిపవర్, న్యూట్రల్ కలిసికట్టుగా మనలో ఉన్నప్పుడు సూపర్‌గా మీరు ఏదంటే అది సాధించగలుగుతారు. కనుక ఇప్పటి నుండి మతిమరుపు మీకు శత్రువా లేక మిత్రువా? మెమరీ పవర్, మతిమరుపు, న్యూట్రల్ - అన్నీ మీ ఫ్రెండ్స్ కావాలి.
కనుక మీకు ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయంటే కారణం, మీలోని 3 opposite ఎనర్జీస్ మధ్య కోపరేషన్ లేకపోవడం. అప్పుడు మీరు పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్ మధ్య ఫ్రెండ్‌షిప్ క్రియేట్ చేయాలి. అలాగే మీరు క్లాస్‌లో టీచర్ చెప్పింది సరిగా వినలేకపోతున్నారంటే - మీ మైండ్ ఆటల మీదకో, సినిమాల మీదకో వెళ్ళిపోవడమో, లేదా ఆ సబ్జెక్టు అన్నా లేదా ఆ టీచర్ అన్నా మీకు ఇష్టం లేకపోవడమో కారణాలు కావచ్చు. కనుక మీరు చదువు-ఆటలు-పాటలు మధ్య ఫ్రెండ్‌షిప్ క్రియేట్ చేయాలి. మైడియర్ ఆటలు ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, కనుక నీవు సపోర్ట్ చెయ్యి, అయిపోయిన తర్వాత ఆడుకుంటానని చెప్పి వాటి మధ్య ఫ్రెండ్‌షిప్ క్రియేట్ చేయండి. ఇలా ఏది చేస్తున్నా మిగతా అన్నింటి సపోర్ట్ తీసుకోండి.
1) ఒక అబ్బాయికి math’s సబ్జెక్ట్ అంటే ఇష్టముండదు. ఎందుకంటే వాళ్ళ math’s టీచర్ ఎప్పుడూ తనని తిడతారట. ఆ సబ్జెక్ట్‌లో ఎప్పుడూ మార్క్స్ తక్కువ వస్తాయట. ఆ అబ్బాయి నా క్లాస్ విన్న తర్వాత - ఆ టీచర్ నన్ను తిడతారు, పొగుడుతారు, న్యూట్రల్ అని అనుకుని, హాయ్ మై డియర్ టీచర్ - ఇప్పటి వరకు మిమ్మల్ని hate చేస్తూ లోపల తిట్టుకున్నాను, i am sorry, మీరు మా మంచి కోసమేగా తిట్టారు, కనుక ఇప్పటి నుంచి మీతో మరియు మీ కోపంతో నేను friendship చేస్తాను అని, తన లోపల ఆ కోపాన్ని friend చేసుకున్నాడు. అలాగే హాయ్ మై డియర్ math’s సబ్జెక్ట్ నిన్ను కూడా నేను hate చేసాను, sorry రా, నీతో నేను ఇప్పటి నుంచి friendlyగా ఉంటాను, ఎలా చదివితే నాకు math’s వస్తుందో అది నాకు తెలియజేయ్యి అని అనుకుని రోజూ 10 మినిట్స్ కరిగిపోవడం ధ్యానం చేసేవాడట. అలాగే రోజూ math’s ప్రాక్టీస్ చేసాడు.
ఇంక చూడండి లోపల math’s సబ్జెక్ట్‌కి సంబంధించిన రకరకాల టెక్నిక్స్ తెలియడం మొదలు పెట్టాయి, math’s సబ్జెక్ట్ ఫ్రెండ్ అయ్యాక ఫార్ములాస్ బాగా అర్ధమవుతున్నాయట. ఆ teacher క్లాస్ కూడా బాగా వినగలిగేవాడట. తర్వాత పెట్టిన math’s ఎగ్జామ్‌లో వీడే క్లాస్ టాపర్. అలాగే వాళ్ళ టీచర్ కూడా వీడిని చూసి ఆశ్చర్యపోయి, ఎలా ఇంత మార్పు వచ్చిందని అడిగి వీడిని క్లాస్‌లో అందరి ముందు ఆ టీచర్ పొగిడారట. అప్పటినుంచి వీడిని అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారట. ఈవిషయం నాకు ఆనందంతో ఫోన్ చేసి చెప్పి, నాకు న్యూఎనర్జీ కాన్సెప్ట్‌కి థ్యాంక్స్ చెప్పాడు.
2) ఒక పాప 10th class చదువుతోంది, తనకి బండి నేర్చుకోవాలని ఉండేది. నేను బండి నడపగలుగుతాను, నడపలేను, న్యూట్రల్ అని మూడింటిని ఎంపిక చేసుకుని వాటి మధ్య ఫ్రెండ్‌షిప్ క్రియేట్ చేసి ధ్యానం చేసింది. బండి నేర్చుకుంటున్నప్పుడు, భయం ఎక్కువ రావడం వలన దానిని బ్యాలెన్స్ చేయలేకపోయింది. ధ్యానంలో కూర్చుని ఈవిధంగా అనుకుందట - మైడియర్ భయం ఎనర్జీ, నువ్వే నాలోపల ఇప్పుడు ఎక్కువగా ఉన్నావు నువ్వు 33%కి తగ్గు, మైడియర్ ధైర్యం ఎనర్జీ నువ్వు 33%కి పెరుగు, అలాగే న్యూట్రల్ ఎనర్జీ నువ్వు కూడా 33%కి రా అని గైడ్ చేసి, మీరందరూ నాకు సహాయం చేస్తేనే నేను నేర్చుకోగలుగుతాను అని అనుకుందట.
ఆ తరువాత రోజు ప్రాక్టీస్ చేస్తుంటే, ఆశ్చర్యంగా breakని, ఎక్స్‌లేటర్ ని ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు వాడాలో ఒకదాని తరువాత ఒకటి గుర్తుకు వచ్చి బండి బాగా drive చేసిందట. ఇలా 2,3రోజులలోనే బండి నేర్చేసుకుంది. అది చూసి వాళ్ల అమ్మ-నాన్న చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు ఇంట్లోకి ఏమి కావాలన్నా ఆ అమ్మాయే మార్కెట్‌కి వెళ్ళి తీసుకువస్తుంది. ఈ మధ్య డబుల్స్ కూడా నేర్చుకుని బాగా డ్రైవ్ చేస్తోంది. అలాగే ఆ అమ్మాయికి వాళ్ళ క్లాస్‌మేట్స్‌తో ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చేదట. ఎప్పుడైతే వాళ్ళ క్యారెక్టర్స్‌తో లోపల ఫ్రెండ్‌షిప్ చేస్తే బయట అందరూ ఆమె ఫ్రెండ్స్ అయిపోయారు. లోపల ఫ్రెండ్‌షిప్ చేస్తే బయట ఎలా మార్పు వస్తుందని నన్ను అడిగితే రిమోట్ ప్రెస్ చేస్తే ఛానల్ మారట్లేదా, అలాగే నీలోపల ఫ్రెండ్‌షిప్ చేస్తే, అది వారి వద్దకు వెళ్ళి వారికి నీతో ఫ్రెండ్లీగా ఉండాలనే ఆలోచనలు వస్తాయని చెప్పాను.
3) ఒక పాప చాలా బాగా చదువుతుంది. 3-4 years నుంచి న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ ఫాలో అవుతూ అన్ని సబ్జెక్ట్స్‌లో క్లాస్ టాపర్. కాని తను చాలా నల్లగా ఉంటుందని inferiority-complex తో బాధపడుతుండేది. అందుకని క్లాస్‌లో ఎవరితోను సరిగా మాట్లాడేది కాదు. ఈ మధ్య నేను కలిసినప్పుడు, తన ప్రాబ్లమ్ గురించి చెప్పింది.
అప్పుడు నేను - నీ bodyతోను, black-energyతోను ఫ్రెండ్‌షిప్ చెయ్యి, అన్ని ఎనర్జీస్ నీ ఫ్రెండ్సేనని చెప్పాను. అప్పటి నుంచి వాటితో friendship చేస్తూ ధ్యానం చేసింది. ఆ పాపకి తన లోపల black energy నుంచి ఇలా మెసేజ్ వచ్చింది – నీ బాడీలో అన్ని కలర్స్ యొక్క ఉపయోగం ఉంటుంది, దేని గొప్పతనం దానికి ఉంటుంది, హెయిర్‌కి బ్లాక్ కలర్ కావాలి, అలాగే పళ్ళకి వైట్‌కలర్ కావాలి, అది ఇక్కడ, ఇది అక్కడ ఉంటే బాగుండదు కదా! సో అన్నీ అవసరమే, కాని నువ్వు మాత్రం blackని hate చేస్తూ white మాత్రమే కావాలి అంటున్నావు, అందుకే నీకు బాధ కలుగుతోంది, ఇప్పటి నుంచి అన్ని colorsని equalగా చూడు అని వచ్చిందట.
అప్పటి నుంచి Black energyతో, inferiority complexతో friendship చేస్తూ, అన్ని కలర్ ఎనర్జీస్‌ని equalగా చూస్తోంది. దేనినైనా hate చేయమనే ఆలోచన రాగానే నేను friendship, hate, neutral మూడు చేస్తా అని మూడింటిని select చేసుకుంటోందట. ఇలా రోజూ practice చేస్తుంటే, తనలోపల inferiority complex balance అవుతూ, క్లాస్‌లో అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతోందట. నువ్వు ఈ మధ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నావు అని, ఫ్రెండ్స్ అందరూ తన ఫ్యాన్స్ అయ్యి న్యూఎనర్జీ కాన్సెప్ట్ చెప్పించు కుంటున్నారట, న్యూఎనర్జీ material కూడా printout తీసుకుని ఫాలో అవుతున్నారట. వాళ్ళ క్లాస్‌లో ఇది బుడ్డి masterగా తయారై, అన్ని ఎనర్జీస్ మన ఫ్రెండ్సే అని classes చెబుతోంది. ఈ మధ్య కొద్దిగా చర్మం కలర్ కూడా change అయ్యింది.
4) బెంగుళూరులో డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయికి ఇంగ్లీష్ అంటే భయం. భయం పోయి నాకు మార్క్స్ రావాలంటే నేను ఏమి చెయ్యాలని నన్ను అడిగింది. నేను ఆ పాపకి - నీ లోపల ఇంగ్లీష్ ఎనర్జీతో friendlyగా మాట్లాడు అని చెప్పాను. ఆ అమ్మాయి - మై డియర్ ఇంగ్లీష్ ఎనర్జీ ఇన్నాళ్ళు నిన్ను నేను hate చేసాను, sorry రా ఇప్పటి నుంచి నీతో friendship చేస్తా అని అనుకుందట. తన లోపల ఆ ఎనర్జీ ఈ విధంగా మెసేజ్ ఇచ్చింది - ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరు మనుష్యులు ఏదైనా మాట్లాడుకోవాలంటే language అనేది చాలా అవసరం. ఏమనుకుంటున్నావు నేనంటే. కానీ నువ్వు నాకు భయపడుతూ, నన్ను hate చేస్తున్నావు, అందుకే నేను నిన్ను ప్రతీ చోట ఇబ్బంది పెడుతున్నా. ఇప్పుడు నాతో friendship చేసి చూడు, అప్పుడు నా talent ఏమిటో నేను చూపిస్తా అని చెప్పిందట. అప్పుడు ఆ అమ్మాయి English languageకి sorry చెప్పి ఇప్పటి నుంచి నీతో నేను friendship చేస్తాను, నాకు నువ్వు help చెయ్యి అని అన్నదట. అప్పుడు ఆ ఇంగ్లీష్ ఎనర్జీ చదువుకునేప్పుడు, ఎలా చదువుకోవాలో కొన్ని easy techniques చెప్పిందట.
అలా చదివి ఆ అమ్మాయి ఎగ్జామ్ రాసింది. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో క్లాస్‌లో అందరి ముందు ఎనౌన్స్ చేస్తూ, వాళ్ల లెక్చరర్ - In my experience I never seen this type of answer sheet, ఏమి framing, ఎక్కడ full stop పెట్టాలో, ఎక్కడ Kama పెట్టాలో, అక్కడ అది చాలా ఫర్‌ఫెక్టుగా పెట్టిందని అంటుంటే, ఆమె నేను కాదేమో వేరే ఫ్రెండ్‌ని పొగుడుతున్నారని అనుకుందట. ఆయన ముందు పేరు చెప్పలేదట. ఆయన ఫ్రేమింగ్ గురించి చెబుతూ ఫైనల్‌గా అప్పుడు ఆమె పేరు చెప్పాడట. అప్పుడు ఆమె సంతోషంతో, నాకు ఫోన్ చేసి సార్ నాకు beautiful result వచ్చిందని చెప్పింది.
అలాగే ఆ అమ్మాయి వాళ్ళ అక్క marriage అప్పుడు సరిగ్గా చదవలేక టెన్షన్ పడ్డది. అప్పుడు నేను చెప్పాను - ఫస్ట్ ఇయరే కనుక ఫేల్ అయినా పర్వాలేదు, అక్క మ్యారేజ్ మళ్ళీ రాదు. నువ్వు ఫుల్‌గా involve అయ్యి, అన్ని పనులు నువ్వే చెయ్యాలి. నేను వస్తాను పెళ్ళికి, ఎక్కడా కూడా నాకు చిన్న పొరపాటు కన్పించకూడదు, ఎనర్జిటిక్‌గా పనులు చెయ్యాలి, ఎప్పుడో ఒక గంట చదువు అంతకన్నా ఎక్కువ వద్దు, మొత్తం టైమ్ దీనికే పెట్టు అని చెప్పాను. నేను చెప్పినట్టే చేసింది.
పెళ్ళి టైమ్‌లో చాలా క్రియేటివ్‌గా వర్క్స్, రకరకాల డెకరేషన్స్, డాన్స్‌లు, పాటలు అన్నింటిలో ఇన్‌వాల్వ్ అవుతూ, రోజూ ఒక గంట చదివింది. మరి నువ్వు వీక్ కావడం లేదా అని అడిగితే, సార్ వీక్‌నెస్ వస్తుంది, కానీ అది కూడా నా ఫ్రెండేగా, ఫ్రెండ్‌షిప్ చేస్తే అది ఫ్రెండ్ అయ్యి నాకు న్యూఎనర్జీని ఇస్తోంది, అందువల్ల అన్నింటిలో involve అవ్వగలుగుతున్నాను సార్ అని అంది. అలాగే పెళ్ళిలో డాన్స్ కూడా బాగా చేసింది స్టేజ్ మీద, దానితో ఆమెకి స్టేజ్ ఫియర్ కూడా పోయింది.
పెళ్ళి అయిన 2రోజులకే ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ రాసింది, అయితే ఏమైందో తెలుసా ఆమె కాలేజ్ ఫస్ట్ వచ్చింది. గంట చదివితేనే. మతిమరుపు, మెమరీ, న్యూట్రల్ మూడు కూడా ఫ్రెండ్స్ అయిపోయాయి ఇక్కడ. మతిమరుపు- ప్లీజ్ నాకు గుర్తుకు వచ్చేలా చెయ్యి అంటే ఎగ్జామ్‌లో ఆ ఎనర్జీ గుర్తు చేసిందట. ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోతూ మీ అక్క పెళ్ళి అని నువ్వు అసలు కాలేజ్‌కే రాలేదు కదా, మరి కాలేజ్ ఫస్ట్ ఎలా వచ్చావు అని అడిగారట. అప్పటి నుంచి అందరూ ఆమె ఫ్యాన్స్ అయిపోయారు. ఆమె తన ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసుకోవడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలబడింది. అటు బయట పనుల్లో యాక్టివ్‌గా ఉంది, ఇటు చదువులోను యాక్టివ్‌గా ఉంది. చాలా మందికి చదువు వస్తే పనులు చేయడం రాదు, పనులు చేయడం వస్తే చదువు రాదు. ఎందుకంటే వారిలోపల 3 ఎనర్జీల కలయిక ఉండదు కనుక.
5) ఇలాంటి మరో బుడ్డి పిల్ల ఉంది. ఆ పిల్ల ఏమి చేస్తుందంటే క్లాస్‌లో ఉన్నప్పుడు తన లోపల సోల్‌తో ఈవిధంగా మాట్లాడుతుందట. ఏ సోల్ నాకు అర్ధం కావటం లేదు, లెసెన్స్ నువ్వు విను అంటుందట, సోల్ వింటుందట. ఎగ్జామ్ హాల్‌లో కూడ సోల్‌తో నేను వినలేదు, నువ్వు విన్నావు కదా నాకు గుర్తు చెయ్యి అని అంటే, సోల్ అన్సర్స్ గుర్తు చేస్తే ఆమె రాసిందట.
6) అలాగే ఒక అబ్బాయి చాలా తెలివైన వాడు. వాడు ఒకేసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినేవాడు, టి.వి చూసేవాడు మరియు చదువుకునే వాడు. ఇది చూసి వాళ్ళమ్మ అదేం చదవడం రా అని తిట్టేది. అప్పుడు నేనడిగాను వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయని, 95% అని చెప్పింది. అప్పుడు నేనన్నాను నీకు ఇంకెన్ని మార్కులు కావాలి, వాడిది మామూలు టాలెంట్ కాదు, ఒకేసారి మూడు పనులు చేయగలుగుతున్నాడు, ఒకవేళ తక్కువ మార్కులు వస్తే తిట్టు లేకుంటే వదిలేయని చెప్పాను.
వాడిని నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. ఈ మధ్య వాడు B.tech complete చేసాడు. Campus interviewsలో 2 కంపెనీలలో వాడు select కాలేదు. Written test లో నెగ్గుతున్నాడు కాని interviewsలో fail అవుతున్నాడు. వాడు న్యూఎనర్జీ సాధన చేస్తున్నాడు కనుక failureని కూడా లైట్‌గా తీసుకుంటున్నాడు, కానీ వాళ్ళ లెక్చరర్‌లు బాధ పడ్డారట. అప్పుడు వాడు నాకు జాబ్ ఎందుకు రావడం లేదని నన్నడిగితే, నీకు చచ్చినా జాబ్ రాదని చెప్పాను. అప్పుడు వాడు డిప్రెస్ అయ్యాడు. Emotion క్లియర్ చేసుకున్న తర్వాత వాడు నేను ఏమి చేయాలని నన్ను అడిగాడు. నీవు బాగా చదువుతావు కానీ నీకు ఇతరులతో మాట్లాడడం రాదు. నువ్వు అన్ని క్యారెక్టర్‌లతో - మిత్రత్వం, సూత్రధారి టాపిక్‌లలో చెప్పినట్టు friendship చెయ్యి అని చెప్పాను.
ఇలా చేసి interviewకి వెళితే, interviewer నీలో ఏమి మార్చుకోవాలని అనుకుంటున్నావని అడిగాడట. అప్పుడు ఈ అబ్బాయి నా క్యారెక్టర్‌ను మార్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడట. నీ క్యారెక్టర్ అంత దరిద్రమా అని అడిగాడట. నా క్యారెక్టర్ మంచిదే కాని నేను భవిష్యత్తులో ఎంతో మందితో కలిసి పని చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కనుకనే నేను అన్ని గుణాలను నాలో కలుపుకుంటూ ఎల్లప్పుడూ నా క్యారెక్టర్‌ని డెవలప్ చేసుకుంటానని చెప్పాడట. ఇది విని interview చేసే అతను వెంటనే నిలబడు అన్నాడట. అతను కూడా లేచి నిలబడి వీడిని కౌగిలించుకుని యూ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పాడట. చూడండి ఎంత అద్భుతమైన ఫలితం వచ్చిందో.
7) అలాగే ఇంకో పాపకి స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు, కంట్లో ఏదో గుచ్చుకుని ఐ-సైట్ ప్రాబ్లమ్ వచ్చింది, డాక్టర్ సలహాతో మందులు, గ్లాసెస్ వాడుతున్నారు. కాని ప్రాబ్లమ్ క్యూర్ అవ్వడం అసాధ్యమని, లైఫ్ లాంగ్ గ్లాసెస్ పెట్టుకోవాలని, జాగ్రత్తగా చూసుకోకపోతే eye కూడా dead అయిపోవచ్చని చెప్పారట. ఎంతమంది డాక్టర్స్‌కి చూపించినా అలాగే చెప్పారట. ఇంకా సైట్ పెరిగిపోతోందట. ఆ పాప నా క్లాస్‌కి వచ్చింది, నేను చెప్పినట్టు కొత్తగా ప్రయత్నం చెయ్యి, అలాగే రోజూ కనీసం టెన్ మినేట్స్ కరిగిపోవడం ధ్యానం చెయ్యి అని చెప్పా.
మైడియర్ శరీరం, మైడియర్ మెడిసిన్స్, మైడియర్ సైట్ ఎనర్జీ ఇన్నాళ్ళు మిమ్మల్ని ద్వేషించాను. I am very sorry అని ఇప్పటి నుంచి మీతో friendship చేస్తాను, మీ అందరూ నాకు help చెయ్యండి అని వాటితో మాట్లాడమన్నాను. మై డియర్ బాడి, నాకు ఐ స్పష్టంగా కనపడాలంటే నేను ఏమి చేయాలని బాడితో మాట్లాడిందట - అప్పుడు బాడీ, నువ్వు నాకు అన్నీ రకాల ఫుడ్స్ పెట్టవు, కొన్నింటినే తింటావు, కొన్నింటిని టచ్ కూడా చెయ్యవు, ముఖ్యంగా ఆయిల్‌కి సంబంధించిన ఫుడ్స్ పెట్టనే పెట్టవు(పల్లీలు), అందుకే నీ కళ్ళలో oil లేకే కంటి చూపు మందగిస్తోంది అని చెప్పిందట. ఇప్పటి నుంచి అన్నీ ఫుడ్స్‌ని ఇష్టంగా తిను, ఇది బాగుంది, ఇది బాగోలేదు అని అనకుండా తిను అని చెప్పిందట.
అలా అన్నింటిని ఇష్టంగా తింటూ ఒక నెల రోజులు సాధన చేసింది. ఏ ఆలోచన వచ్చినా 3 ఎనర్జీలతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాను అని అనుకుని ధ్యానం చేసింది. మధ్య మధ్యలో కళ్ళలో మంట పుట్టి నీరు కారేది. హాయ్ మైడియర్ pain energy నువ్వు కూడా నా ఫ్రెండే, నువ్వు నాకు help చెయ్యి, నేను స్కూల్లో ఉన్నప్పుడు రావద్దు ప్లీజ్ నేను ఇంటికొచ్చాక రా అని దానితో ఒక friend తో మాట్లాడినట్టు మాట్లాడేది, విచిత్రంగా ఆ pain ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేదట. ఆ pain తట్టుకోలేక ఏడుపు వస్తే ఏడ్చేసి పడుకుండి పోయేదట. కళ్ళలో ఏదో రిపేర్ అయ్యినట్టు అనిపించేదట. అంతే ఒక నెల రోజుల తరువాత ఐ సరిగ్గా కనిపించడం గమనించిందట, 2 నెలల తర్వాత డాక్టర్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయించుకుంటే, అది చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడట. ఎలా తగ్గిందని వాళ్ళ పేరెంట్స్‌ని అడిగి న్యూఎనర్జీ కాన్సెప్ట్ గురించి తెలుసుకుని ఆయన కూడా ఫాలో అవుతున్నాడు. చూడండి ఎంత అద్భుతమో!
కనుక ఇప్పటినుంచైనా శరీరాన్ని, మనసును దయచేసి నమ్మండి, భగవంతుడి సృష్టిలో శరీరం, మనసు అనేవి చాలా అద్భుతమైనవి. నేను చెప్పిన సాధనలు 40 రోజులు క్రమం తప్పకుండా ఒక డ్యూటీలా మీరు చేసి చూడండి అప్పుడే మీకు తేడా తెలుస్తుంది. దేనినైనా సాధించగలిగే టాలెంట్ మీ శరీరానికి, మనసుకు ఉంది.
కనుక ఈ సృష్టిలో ఏదీ అనవసరంగా లేదు ప్రతీదాని యొక్క ఉపయోగం ఉంది, మీరు ఫ్రెండ్ అనుకుంటే అది మీకు సహాయం చేస్తుంది, ఎనిమీ అనుకుంటే సహాయం చేయదు. కాబట్టి అన్నింటి యొక్క సహాయం తీసుకోండి. ఇలా చేయడం వలన పిల్లలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. అటు ఆటలు ఆడుతున్నారు, టీ.వీ. చూస్తున్నారు, క్రియేటివిటిని పెంచుకుంటున్నారు, అమ్మకు ఇంట్లో పనులలో, నాన్నకు బయటి పనులలో సహాయం చేస్తున్నారు, వంటలు నేర్చుకుంటున్నారు, తల్లి-దండ్రులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అలాగే ఇటు చదువులలో కూడా విజయాలు సాధిస్తున్నారు. కనుక ఆడ-మగ అనే వ్యత్యాసం చూపించకుండా ఆడపిల్లలకు బయటి పనులు, అలాగే మగ పిల్లవాడికి ఇంటి పనులు కూడా నేర్పించమని తల్లి-దండ్రులకు సలహాయిస్తున్నాను.