మూడు
పాపాలు
మనం
మామూలుగా
మంచి చేయడం
పుణ్య
కార్యమని, చెడు
చేయడం పాప
కార్యమని
నమ్ముతున్నాము.
కానీ
ఉపనిషత్తులు
అలాగే
అద్వైతం
దీనికి భిన్నంగా
చెబుతున్నాయి.
మూడు
విధాలైన
పాపాలు
మనిషిని
పట్టి పీడిస్తున్నాయి
అని
అద్వైతం
చెబుతోంది.
ఒకటి అవిద్య.
రెండవది
కామం. మూడవది
కర్మ.
నా
అఖండ
తత్వాన్ని గ్రహించకపోవటం
అవిద్య.
అంటే నేనే
అంతా అంతా
నేనే, నేను
తప్ప ఈ
సృష్టిలో ఏమీ
లేదు, నేనే
అనేక రూపాలలో
నిత్యం నాకే
కనిపిస్తున్నాను
అనే జ్ఞానం
అనుభవంలో
లేకపోవడం.
అంటే భిన్నత్వం
లేదు ఉన్నది
ఏకత్వమే
అనేది అనుభవంలో
లేకపోవడమే
మొదటి పాపం.
అఖండం
ఖండమై
కనిపిస్తే
దాన్ని
పొందాలని అభిలషించటం
కామం. ఎప్పుడైతే
ఒకటి కంటే
ఎక్కువ
వాస్తవంగా
ఉన్నాయని నమ్ముతామో, అప్పుడు
విభజన ద్వంద్వం
అనేకత్వం
ఏర్పడుతుంది.
మనకు అన్యంగా
ఏదో ఉంది అని
అనిపిస్తుంది.
అప్పుడు
అన్యంగా ఉన్న
దాన్ని
పొందాలి అనే
కోరిక లేదా
కామం
పుడుతుంది.
ఇదే రెండవ
పాపం.
పొందటానికి
చేసే
ప్రయత్నం
కర్మ. ఎప్పుడైతే
నా దగ్గర
లేనిది బయట
ఏదో ఉంది అని
అనుకుంటారో, అప్పుడు
ఆ బయట ఉన్న
దానిని
పొందడానికి, మీరు
ప్రశాంత
స్థితిని
వదులుకొని
కదులుతూ ప్రయత్నిస్తారు.
ఇదే కర్మ అంటే,
ఇదే మూడవ
పాపం అంటే.
ఇవి
మూడూ ఒకదానికొకటి
కారణమై అన్నీ
కలిసి చివరకు
మనల్ని ఈ
సంసార సాగరంలో
పడేసాయి.
దీన్ని
తప్పించుకోవాలంటే
అన్నింటికీ
మూలకారణమైన అవిద్యను
ముందు
నిర్మూలించాలి.
దాన్ని
నిర్మూలిస్తే
చాలు. మిగతాదంతా
నిర్మూలమై
పోతుంది.
అవిద్యకి విరుగుడు
విద్యే. అంటే
అఖండమైన
జ్ఞానమే. అంటే
మనం
భిన్నత్వం
నుంచి ఏకత్వం
వైపు, ద్వైతం
నుంచి
అద్వైతం వైపు
పయనించి
అద్వైత స్థితితో
ఏకమైనప్పుడే
- ఈ పాపాల
నుంచి మనకు
ముక్తి
లభిస్తుంది.
అంటే
దైవంతో ఏకమవ్వకుండా, దైవం
వైపు అడుగులు
వేయకుండా, దైవిక
గుణాలను
పెంచుకోకుండా,
దైవాన్ని
స్మరించుకోకుండా
మీరు ఎంత
గొప్ప పని
చేసినా అది
పాపమే
అవుతుందని
గ్రహించండి.
అందువలన
మీరు
బాహ్యంగా ఏదో
పొందాలి అనే
ఉద్దేశ్యంతో
కర్మ
చేయడాన్ని
కొంత సేపు ఆపి, దానికి
సంబంధించిన
కోరికను
గుర్తించి
దాన్ని కూడా
వదిలేసి, అలాగే
ఆ కోరికకు
కారణమైన అవిద్యను
గుర్తించి
అంటే దైవం
నాకంటే
విడిగా
ఎక్కడో ఉన్నాడనే
అజ్ఞానపు
స్థితిని
గుర్తించి దాన్ని
కూడా వదిలేసి,
ముందు
ఏకత్వ
స్థితితో మమేకమవ్వండి.
మీరు
ఏవైతే
బాహ్యంగా
పొందాలని అనుకుంటున్నారో, అవన్నీ
సూక్ష్మరూపంలో
అంటే
విత్తనంలో
వృక్షం
ఉన్నట్టు, మీలోనే ముందే
సిద్ధమై
ఉన్నాయి. కనుక
మీరు ఏకత్వ
స్థితిలో
ఉంటే సూక్ష్మ
రూపంలో ఉన్న
వాటిని చాలా
సులభంగా
స్థూల
రూపంలోకి
తీసుకురావచ్చు.
అంటే ఏకత్వ
స్థితిలో
మీరు ఎంపిక
చేసుకున్న సత్-సంకల్పం
సులభంగా
నెరవేరుతుందని
గ్రహించండి.
అందువలన
మీరు మంచి
చేయడం పుణ్యకార్యమని, చెడు
చేయడం పాపకార్యమనే
సాధారణమైన
మామూలు
జ్ఞానాన్ని
అధిగమించి, పైన చెప్పిన
మూడు రకాల
పాపాలే అసలైన
పాపాలని
గుర్తించి, వాటిని కూడా
అధిగమించి, మనలోనే సిద్ధంగా
ఉన్న
"నేనే అంతా అంతా
నేనే" అనే
అద్వైత
స్థితితో
ఏకమై,
"అహంబ్రహ్మాస్మి" అంటే "నేనే
దైవాన్ని" అని
అనుభవపూర్వకంగా
తెలుసుకోండి.
అద్వైత
జ్ఞానానికి
సంబంధించిన టాపిక్స్‌ను
చదవడానికి ఈ
లింకును
క్లిక్
చేయండి
https://www.darmam.com/poornam/
పూర్ణం
జ్ఞానానికి
సంబంధించిన టాపిక్స్‌ను చదవడానికి
ఈ లింకును
క్లిక్
చేయండి
https://www.darmam.com/advaitam/
సమృద్ధి
పుస్తకం
టాపిక్ లను
చదవడానికి ఈ
లింక్ పై
క్లిక్
చేయండి https://www.darmam.com/samrudhi1/
దివ్యమానవుడు
పుస్తకం
టాపిక్ లను
చదవడానికి ఈ
లింక్ పై
క్లిక్
చేయండి https://darmam.com/mobileview.html