సమృద్ధి
సంకల్పం:
నేను
ఇక్కడే, ఇప్పుడే
అందుబాటులో
ఉన్న మరియు
అంతటా వ్యాపించి
ఉన్న శాశ్వత
సమృద్ధిని
ఎంపిక చేసుకుంటున్నాను.
● అంటే
తాత్కాలిక
సమృద్ధి
(భవిష్యత్తులో
పొందుతాం అనే
నమ్మకం) నుంచి
శాశ్వత
సమృద్ధి (ఇక్కడ
మరియు
ఇప్పుడు
అందుబాటులో
ఉన్న స్థితి)
వైపు మార్పు
చెందడం.
● దీని
అర్ధం
కష్టపడితే
గాని ఏది
పొందలేము, అర్హత
ఉండాలి లేదా
తలరాతలో రాసి
పెట్టి ఉండాలి
అనే పరిమిత
నమ్మకాల
నుంచి విడుదల
చేస్తూ, ఇప్పుడే
ఇక్కడే ఉన్న
శాశ్వత
సమృద్ధితో
అనుసంధానం
కావడం.
● ఈ
పరివర్తన
అనేది
మిమ్మల్ని
సమృద్ధి
యొక్క నిజ
స్వభావంతో
కనెక్ట్
చేస్తుంది.
● ఈ శాశ్వత
సమృద్ధి
అనేది
ఎల్లప్పుడూ
అంతటా అందుబాటులో
ఉండే శక్తి.
● దీనిని
పొందడానికి ఏ
షరతులు లేవు, ఏ
అర్హతలు లేవు, ఏ
పరిమితులు
లేవు.
● ఈ శక్తి ఏ
క్షణంలోనైనా
ఏ రూపాన్ని
అయినా తీసుకోగలదు
- అది ఆరోగ్యం, సంపద, ప్రేమ
లేదా విజయం ఏదైనా
కావచ్చు.
ఇది
ఎలా పని చేస్తుందో
అర్థం
చేసుకోవడానికి
దీన్ని మరింత విశ్లేషిద్దాం:
సర్వవ్యాపకమైన
శక్తి: విశ్వమంతటా
ప్రవహిస్తున్న
సమృద్ధి
● సమృద్ధిని
మనం
సాధించాల్సిన
లేదా రూపొందించాల్సిన
వస్తువుగాను
మరియు
భవిష్యత్తులోని
ఒకానొక
సమయంలో మాత్రమే
ఇది మన
దగ్గరకు
వస్తుందని
భావిస్తాము.
● కాని
నిజమైన
సమృద్ధి
అనేది
కాలానికీ
లేదా పరిస్థితులకీ
పరిమితమై
ఉండేది కాదు.
ఇది సర్వ
జ్ఞాన మరియు
సర్వ వ్యాపక
శక్తి.
● ఈ శక్తి -
గతం, వర్తమానం
మరియు
భవిష్యత్తులతో
సంబంధం లేకుండా
అన్ని వేళలా
అందుబాటులో
ఉంటుంది. ఎందుకంటే
ఇది విశ్వం
యొక్క
స్థిరమైన
శక్తి కనుక.
● ఈ సమృద్ధి
శక్తి - ఏ
రూపాన్ని
అయినా
తీసుకోగలదు, ఆరోగ్యం, సంపద, సంబంధాలు, విజయం
లేదా
ఆనందాన్నైనా
ధారణ చేయగలదు.
● మీరు దేనితో
సంబంధం
పెట్టుకున్నారో, దానికి
అనుగుణమైన
రూపంలో ఇది ఏ
క్షణంలోనైనా
మీకు
కనిపించవచ్చు.
● సమృద్ధిని
పొందాలంటే -
మీరు
జీవితంలో ఏదో
సాధించాల్సిన, ఏదో
అధిగమించాల్సిన
అవసరం గాని ఏ
మాత్రం లేదు; మీరు
చేయాల్సింది
- కేవలం అది
ఇప్పుడే
ఇక్కడ
ఉన్నదని
గుర్తిస్తే
చాలు, తక్షణమే
మీ జీవితం
సమృద్ధి
శక్తితో నింపబడుతుంది.
● సమృద్ధి
అంటే కేవలం
డబ్బు
మాత్రమే కాదు.
సమృద్ధి
అనేది
జీవితంలోని
వివిధ
అంశాలను కలిగి
ఉంటుంది. ఇది
ఆరోగ్యం, సంతోషం, ప్రేమ, స్నేహం, కుటుంబం, ఆధ్యాత్మికత, జ్ఞానం
మరియు
సామాజిక
సంబంధాలు
వంటి అనేక అంశాలను
కలిగి
ఉంటుంది.
● డబ్బు ఒక
ముఖ్యమైన
అంశం
అయినప్పటికీ, అది
మాత్రమే
సమృద్ధిని
నిర్వచించదు.
సమృద్ధిగా
ఉండటం అంటే
జీవితంలో
సంతులనం
మరియు సంతృప్తిని
కలిగి ఉండటం.
సమృద్ధి
శక్తి అనేది కాలాతీతమైనది:
గతం, వర్తమానం
మరియు
భవిష్యత్తులకి
అతీతమైనది
గతం:
● సమృద్ధి
ఎల్లప్పుడూ
మీకు
అందుబాటులో
ఉంది, అది
మీకు
అందుబాటులో
లేనట్లు మీకు
అనిపించిన
సమయాల్లో
కూడా.
● మీ
జీవితంలోని
ప్రతి అనుభవం
ద్వారా, మీకు
మంచిగా లేదా
చెడుగా
అనిపించిన
ప్రతి అనుభవమూ, మీలోని
సమృద్ధి
శక్తి జాగృతమయ్యేందుకు
మరియు
వికసించేందుకు
సహకరించినవే.
● మీరు సదా
విశ్వ శక్తి
ప్రవాహానికి అనుసంధానమయ్యే
ఉన్నారు, ఏ ఒక్క
క్షణం మీరు
దానితో
విడిపోయి
లేరు.
● మీ గతమే, ఈ
రోజు మీరు
ఉన్న
స్థితికి ఒక
రూపాన్ని
కల్పించింది.
మీరు ఇప్పటి
వరకూ
ఎదుర్కొన్న
సవాళ్లు
అన్నీ కూడా, అంతటా
వ్యాపించి
ఉన్న శక్తి
యొక్క
అనుభవాన్ని
పొందడానికి
మరియు దానితో
సదా అనుసంధానం
అయ్యి
ఉండడానికి
కావలసిన
శిక్షణని
అందించడంలో
భాగంగానే
జరిగాయి.
● ఉదాహరణ:
గత విజయాలను
మీరు ఒకసారి
గమనిస్తే, మీరు
సాధించిన ప్రతీది
ఈ సమృద్ధి
ప్రవాహం
నుండి
వచ్చినవేనని
అర్ధం
చేసుకోగలరు. ఆ
సమయంలో అది
స్పష్టంగా
లేకపోయినప్పటికీ
కూడా, సమృద్ధి
శక్తి
కీలకమైన
పాత్ర
పోషించిందని ఆ
సంఘటనలు మనకి
తెలియజేస్తాయి.
● గతంలో
కూడా మీకు
సమృద్ధి
అందుబాటులో
ఉందని గుర్తించడం
వలన, మీరు
ఆ శక్తి
ప్రవాహంతో మీకున్న
శాశ్వత
సంబంధాన్ని
ఎరుకలో
అనుభూతి
చెందుతారు.
ఇది మీ జీవిత
ప్రయాణమంతా
మీకు మార్గ
నిర్దేశకత్వం
చేస్తూనే
ఉన్నది, మీకు
సహకరిస్తూనే
ఉన్నది మరియు
మిమ్మల్ని సదా
శక్తివంతం
చేస్తూనే
ఉన్నది.
(ఇప్పటికి, ఎప్పటికీ
మరియు అనంతకాలం
వరకూ.)
వర్తమానం:
సమృద్ధి
ఇప్పుడు మీకు
అందుబాటులోనే
ఉంది. ఈ వర్తమానంలోనే
సమస్త శక్తి
ఉన్నది. ఈ
క్షణంలోనే
మీరు సమృద్థి
యొక్క
అనంతమైన
శక్తి-సామర్ధ్యాలను
అనుభూతి
చెందగలరు, అనుభవించగలరు, ఉపయోగించుకోగలరు.
● సమృద్ధిని
నిరంతరం
స్థిరంగా
ప్రవహించే శక్తిగా
మీరు
అంగీకరించిన
తక్షణమే, అది
మీకు ఇప్పుడు
మరియు ఇక్కడ
అందుబాటులో ఉందన్న
అనుభవాన్ని
మీరు
గ్రహించడం
ప్రారంభిస్తారు.
● ఉదాహరణ:
నేను
సమృద్ధిగా
ఉన్నాను, లేదా
నేను ఇప్పుడు
ఆరోగ్యంగా, సంపన్నుడిగా
మరియు
విజయవంతంగా
ఉన్నాను వంటి జ్ఞానసూత్రాలను
వర్తమాన
క్షణంలో
సంకల్పించడం
ద్వారా, మీరు
తక్షణమే
సమృద్ధి
శక్తితో
అనుసంధానం అవుతారు.
● అప్పుడు
భవిష్యత్తులో
మీ కోరికలు నేరవేరడానికి
ఎదురు చూడాల్సిన
అవసరం లేదు.
ఎందుకంటే ఈ
క్షణంలోనే
అందుబాటులో
ఉన్న శాశ్వత
సమృద్ధి
యొక్క
శక్తితో కనెక్ట్
అయ్యి, మీరు
ఇప్పుడే
దానిని
పొందుతున్నారు
కనుక.
భవిష్యత్తు
(కాలాన్ని
అధిగమించడం):
● భవిష్యత్తు
అనేది
సమృద్ధి
నుండి
విభజింపబడిన
భాగం ఎంత
మాత్రం కాదు, ఎందుకంటే
శక్తి అనేది కాలాతీతమైనది.
● ఇప్పుడు
దానితో
శృతిలో ఉండడం
ద్వారా, మీరు
భవిష్యత్తులో
సమృద్ధిశక్తి
మరింతగా మీ
జీవితంలో
ప్రవహించడానికి
కావలసిన
వేదికను ఇప్పుడే
సిద్ధం
చేస్తున్నారు
కనుక.
● అందువలన
భవిష్యత్తుని
ఇకపై
సమృద్ధిని
పొందే
ఆశాజనకమైన
సమయంగా మరియు
ఎదురు చూడాల్సిన
వేదికగా
ఉంచవలసిన
అవసరం మీకు ఏ
మాత్రం లేదు. ఎందుకంటే
మీరు
ఇప్పటికే ఆ
సహజ
ప్రవాహంలో భాగమై
ప్రవహిస్తున్నారు
కనుక.
● ఉదాహరణ:
భవిష్యత్తు
మీకు ఆరోగ్యం, సంపద
లేదా
విజయాన్ని
తెచ్చే వరకు
మీరు వేచి
ఉండాల్సిన
అవసరం లేదు.
● మీరు
ఇప్పుడు మీ
అత్యున్నత
సామర్థ్యంతో
ఇప్పటికే
అనుసంధానమై
ఉన్నారని
సంకల్పించడం ద్వారా, మీరు
వర్తమానంలో
పొందుతున్న సమృద్ధియే
భవిష్యత్తులోనూ
ప్రతిబింబిస్తోందని
మీరు
నిర్ధారించినట్లే
కదా!
సర్వవ్యాపకమైన
శక్తి, ఏ
రూపాన్నైనా
తక్షణమే
తీసుకోగలదు
● సమృద్ధి
అనేది సమయానికో
లేదా స్థలానికో
పరిమితమైనది
కాదు. కనుక
అది తక్షణమే ఏ
రూపంలోనైనా వ్యక్తమవ్వగలదు.
● సమృద్ధిని
పొందాలంటే, మీ
చుట్టూ ఉన్న
పరిస్థితులు మారేంతవరకు
మీరు వేచి
ఉండాల్సిన
అవసరం లేదు.
● మీరు మీ
శక్తిని
ఎక్కడ కేంద్రికరిస్తే, దానికి
తగ్గ
రూపాన్ని
తక్షణమే
తీసుకోగలదు.
● ఉదాహరణ:
మీకు ఆర్థిక
సమృద్ధి
అవసరమైతే, అది
మీరు ఊహించని
అవకాశాలను, అంటే
కొత్త
ఉద్యోగాన్ని, కొత్త
వ్యాపారాన్ని, దానికి
తగిన మనుషులను
పరిచయం చేయడం, లేదా
దానికి తగిన
సృజనాత్మక
ఆలోచనలను
అందిస్తుంది.
● మీరు
ఆరోగ్యాన్ని
కోరుకుంటే, అది
అకస్మాత్తుగా
మీ శరీరంలో
శక్తిని ప్రవహింప
చేసి, దివ్యమైన
ఆరోగ్య
స్థితిని
మీరు పొందేలా
చేయవచ్చు.
● మీరు
ప్రేమను
కోరుకుంటే, అది
మీ చుట్టూ
ఉన్న వారితో
లోతైన
సంబంధాలను ఏర్పర్చవచ్చు, లేదా
మీ
మనస్తత్వానికి
తగిన కొత్త
వ్యక్తులను
పరిచయం
చేయవచ్చు.
● ఇక్కడ
గమనించాల్సిన
విషయం
ఏమిటంటే, సమృద్ధి
ఎప్పుడైనా
ఎక్కడైనా
ఏ రూపాన్నైనా
తీసుకోగలదు, అలాగే
అది
కాలక్రమాన్ని
linear
timeline అనుసరించాల్సిన
అవసరమూ లేదు.
● అందువలన
మీరు
భవిష్యత్తులోని
"ఒకానొక సరైన
సమయం" కోసం వేచి చూడాల్సిన
అవసరం లేదు.
మీరు
కోరుకునే
సమృద్ధి
ఇప్పుడే మీకు
కనిపించవచ్చు
మరియు
పొందవచ్చు, ఎందుకంటే
మీరు
విశ్వమంతా
వ్యాపించిన
శక్తితో
అనుసంధానం
అవుతున్నారు
కనుక.
తాత్కాలిక
సమృద్ధి లేదా
శాశ్వత
సమృద్ధి వీటిలో
ఏది ఎంపిక
చేసుకోవాలి
● తాత్కాలిక
సమృద్ధి అంటే
- మీ జీవితంలో
కొన్ని
సవాళ్లను
మీరు
అధిగమించిన
తర్వాతే, లేదా
భవిష్యత్తులో
ఒకానొక సరైన
సమయం వచ్చినప్పుడు
మాత్రమే మీరు కోరుకున్నది
మీకు
దక్కుతుందని
మీరు బలంగా
నమ్మడం లాంటిది.
● ఈ
మనస్తత్వం
మిమ్మల్ని మీ
సామర్థ్యాన్ని
పరిమితం చేస్తూ
- సమృద్ధిని
పొందడానికి
అర్హత ఉండాలని, లేదా
తగిన సమయం
రావాలని
మిమ్మల్ని
షరతులలో బంధి
అయ్యేలా
చేస్తున్నది.
● శాశ్వత
సమృద్ధి అంటే
- మీకు సదా
సమృద్ధి అందుబాటులోనే
ఉందని, ఇక్కడే
మరియు
ఇప్పుడే
ఉందని మీరు
గుర్తించడమే.
ఎందుకంటే
విశ్వంలోని
ప్రతి అణువణువులో
ఉన్నది మరియు ప్రవహిస్తున్నది
ఇదే కనుక.
● అలాంటప్పుడు, అది
మీ వద్దకు
రావడానికి
మీరు ఒక
నిర్దిష్ట క్షణం
కోసం వేచి
చూడడం ఎందుకు? మీరు
కేవలం ఆ
ప్రవాహానికి
శృతి కావాలని
ఎంచుకున్న
వెంటనే, మీరు
కోరుకున్న ప్రతీది ఈ
క్షణంలోనే
మీకు
అందుబాటులో
ఉందన్న విషయాన్ని
మీరు స్వయంగా
గుర్తిస్తారు.
● ఉదాహరణకి:
తాత్కాలిక
సమృద్ధి
ప్రకారం, ఆర్ధిక
సమృద్ధి లేదా
డబ్బు
రావడానికి
మీరు నిర్దిష్ట
ఉద్యోగం లేదా
వ్యాపార
అవకాశాల కోసం వేచి
ఉండాలి.
● అదే
శాశ్వత
సమృద్ధి
ప్రకారం, ఆర్ధిక
సంపద అనేది
ఇప్పుడే
మీకు
అందుబాటులో
ఉందని
గుర్తిస్తూ -
మీ ఆలోచనలు, అనుభూతులు, నమ్మకాలు
మరియు పనులను
సమృద్ధి
శక్తికి తగినట్టుగా
శృతి చేయడం
ద్వారా మీరు
దానిని తక్షణమే
ఆకర్షిస్తారు.
సర్వవ్యాపకమైన
సమృద్ధితో
ఎలా
అనుసంధానం
కావాలి:
అనుభూతులు:
● మీ
అనుభూతులు
అనేవి
అనుకున్న
తక్షణమే సమృద్ధితో
అనుసంధాన మయ్యేందుకు
సహకరించే
సాధనాలు. కేవలం
మీరు చేయవలసినది
ఇప్పుడే
ఇక్కడే నేను
సంపన్నుడిగా
ఉన్నాను అని
అనుభూతి
చెందితే చాలు.
● అంటే మీ
బాహ్య
పరిస్థితులు
ఎలా
ఉన్నప్పటికీ, మీరు
కృతజ్ఞత, సంతృప్తి
మరియు ఆనందానుభూతుల
పారవశ్యంతో
నిండి
పోవడమన్న మాట.
● మీరు
సమృద్ధిగా
ఉన్నట్లు
అనుభూతి
చెందితే, మీరు మీ
జీవితంలో
మరింత
సమృద్ధిని
ఆకర్షించే అయస్కాంతలా
తయారవుతారు.
ఆలోచనలు:
● ఆలోచనలు
మీ
వాస్తవాన్ని
సృష్టిస్తున్నాయి.
సమృద్ధి
అనేది
భవిష్యత్తులో
మాత్రమే పొందే
వస్తువు అని
మీరు పదేపదే
భావిస్తున్నట్లయితే, మీరు
భవిష్యత్తు-కేంద్రీకృత
మనస్తత్వాన్ని
బలపరుస్తున్నారు.
● అలా
కాకుండా, వర్తమానంలోనే
సమృద్ధిని
ప్రతిబింబించే
జ్ఞాన
సూత్రాలతో మీ
ఆలోచనలను
మార్పు
చెందించండి:
"నేను
ఇప్పుడు
సమృద్ధిగా
ఉన్నాను," "నేను
అపరిమిత
సంపదకు
అర్హుడిని," "నా
ఆరోగ్యం
వృద్ధి చెందుతున్నది."
నమ్మకాలు:
● మీ
నమ్మకాలు మీ
అనుభవాన్ని
రూపొందిస్తున్నాయి.
సమృద్ధి
అనేది చాలా
దూరంలో ఉన్న
అవకాశం అని
మీరు నమ్మితే, మీరు
వర్తమాన
క్షణం యొక్క
శక్తిని
పూర్తిగా
ఉపయోగించుకోవడం
లేదనే దాని
అర్ధం.
● కేవలం మీ
నమ్మకాలను
మార్చడం వలన -
సమృద్ధి సర్వవ్యాపకమైనది, మీకు
ఇప్పుడే
అందుబాటులో
ఉందని మరియు
మీ ద్వారా సదా
ప్రవహిస్తున్నదని
అర్థం
చేసుకోగలరు.
మీరు ఎంత
ఎక్కువగా
నమ్మితే, అంత
ఎక్కువగా
మీరు దానిని
అనుభవిస్తారు.
చర్యలు:
● వర్తమాన
క్షణంలో సరైన
ప్రేరణ
కలిగించే పనులు
లేదా చర్యలు
చేయడం అనేది
చాలా
ముఖ్యమైన విషయం.
అంటే మీరు
ఇప్పుడే
సమృద్ధిగా
ఉన్నట్లుగా
ప్రవర్తించడమన్న
మాట.
● అప్పుడు
మీరు మీ
చుట్టూ ఉన్న
పరిస్థితులు
మారే వరకు వేచి
ఉండకుండా; మీరు
మీ పనుల
ద్వారా, అంటే
మిమ్మల్ని
మీరు
ప్రేమించుకోవడం, సంబంధాలను
మెరుగు పరచుకోవడం, కొత్త
పెట్టుబడులు, కొత్త
అవకాశాలు, లేదా
కొత్త
సృజనాత్మక
ఆలోచనలను
అనుసరించడం
ద్వారా
సమృద్ధికి అనుసంధానమవుతారు.
ఫలితం:
అపరిమిత
అవకాశాల
జీవితం
● మీరు
సర్వత్రా
ఉండే సమృద్ధి
శక్తితో
అనుసంధానం
అయినప్పుడు, మీరు
సమృద్ధి
యొక్క సహజ
ప్రవాహ
స్థితికి అనుగుణంగా
జీవించడాన్ని
ఆరంభిస్తారు.
● అప్పుడు
మీరు
సమస్యలను
లేదా
ఎదురుదెబ్బలను
అడ్డంకులుగా చూడకుండా, వాటిని
మరింత
ఉన్నతమైన
సమృద్ధికి
మిమ్మల్ని
చేరువ చేసే
ప్రక్రియలో
భాగంగానే
ఇవన్నీ ఉన్నాయని
అర్థం
చేసుకుని
మరియు అన్ని
పరిస్థితులను
సమానంగా
స్వీకరించడానికి
సదా సిద్ధమై
ఉంటారు.
● సమృద్ధి
అనేది మీరు
పోరాడి సాధించివలసినదో
లేదా ఓపికగా వేచి ఉండి పొందవలసినదో
కాదని మీరు
గ్రహించి, అన్ని
కర్మ బంధాల
నుండి
విముక్తి
పొందుతారు.
అలాగే ఇది మీ
జీవితంలోకి
మీ ద్వారానే
ప్రవహిస్తూ
అనంతమైన
రూపాలుగా వ్యక్తమవుతుంది.
● సమృద్ధి
అంటే
భవిష్యత్తులో
సాధించవలసినదేనని
మీరు నమ్మిన
స్థితి నుండి, కాదు
కాదు అది
ఇక్కడే
ఇప్పుడే
అందుబాటులో
ఉందని తెలుసుకోవడం
వరకు, మీరు
చేసిన
ప్రయత్నం
ద్వారా - మీ
మానసిక స్థితిలో
ఒక గొప్ప
పరివర్తన
సంభవించింది.
● ఈ పరివర్తన, మిమ్మల్ని
అపరిమిత
సామర్థ్యాలతో
నిండిన జీవితంలోకి
మీరు
ప్రవేశించేందుకు
మరియు ప్రతి
క్షణం ఆ
శక్తిని
ఆకర్షించే ఉపయోగించుకోగలిగే
ఒక
అయస్కాంతంగా
మిమ్మల్ని
తయారు
చేసింది.
● ఇది మీకు
కావలసిన
దాన్ని
సృష్టించడానికి
మరియు
పరమాత్మతో
ఎల్లప్పుడూ
శృతిలో
ఉండడానికి ఒక
గొప్ప అవకాశం.
● సమృద్ధి
ఇక గమ్యస్థానంగా
కాకుండా, ఇది ఒక
ప్రయాణంగా
ఉంటూ, మిమ్మల్ని
పరమాత్మ వైపు
ప్రయాణించేలా
చేస్తున్నది.
అపరిమిత
సమృద్ధి
మరియు
స్వచ్ఛమైన
శక్తి
● అపరిమిత
సమృద్ధి
మరియు
స్వచ్ఛమైన
శక్తికి చాలా
దగ్గర సంబంధం
ఉంది, కానీ
అవి రెండూ
ఒకటి కాదు.
● అపరిమిత
సమృద్ధి
అనేది
జీవితంలో
మనకు అందుబాటులో
ఉన్న
సిరిసంపదలు
మరియు
అవకాశాల యొక్క
అంతులేని
ప్రవాహంతో
ఎల్లప్పుడూ
మనం అనుసంధానమై
ఉన్నామనే
ఆలోచనను మనకి
గుర్తు
చేస్తుంది.
● ఇది
జీవితం
అందించే
అన్ని
విషయాలను -
భౌతికమైనా, భావోద్వేగమైనా
లేదా
ఆధ్యాత్మికమైనా
విషయాలన్నింటిని
స్వీకరించే
హృదయంతో
సిద్ధంగా
ఉండమని సూచిస్తుంది.
● స్వచ్ఛమైన
శక్తి -
విశ్వంలోని
ప్రతీ దానికీ మూలాధారమైనది.
అన్ని విషయాల
వెనక ఉండి
నడిపిస్తున్న
శక్తి మరియు
ఉనికి ఇదే.
● అపరిమిత
సమృద్ధి
అనేది - ఈ
స్వచ్ఛమైన
శక్తి నుండి
ఆవిర్భవించిన
శక్తిగా
పరిగణించవచ్చు.
● ఒక్క
మాటలో
చెప్పాలంటే, స్వచ్ఛమైన
శక్తి ఈ సమస్త
విశ్వానికే
మూలం, విశ్వంలోని
సమస్త
సమృద్ధికి
కార్యరూపాన్ని
అందించే మాతృ
స్వరూపిణి, జగన్మాత.
● అనంతమైన
సమృద్ధి
అనేది
స్వచ్ఛమైన
శక్తి యొక్క వ్యక్తీకరణయే.
● ఈ రెండూ
ఎప్పుడూ
అనుసంధానం
అయ్యే
ఉన్నాయి. స్వచ్ఛమైన
శక్తి పునాది
అయితే, సమృద్ధి
అనేది దాని
నుంచి
ఉద్భవించే
అనేకానేక
ఫలితాలలో
ఒకటి. అంటే
స్వచ్ఛమైన
శక్తి ఒక వృక్షమైతే, ఆ
వృక్షానికి
కాసిన ఒకానొక
పండు సమృద్ధి
అన్నమాట.
సారాంశం:
● సమృద్ధి - సర్వవ్యాపకమైనది, కాలాతీతమైనది, ఇది
సర్వకాల సర్వ
అవస్థల యందు
అందుబాటులో
ఉందని
గుర్తించి
దానిని ఎంపిక చేసుకోవడం
ద్వారా, మీరు
అనంతమైన
సామర్ధ్యాలతో
కలిగిన
ఒక సరికొత్త
జీవితాన్ని
అనుభవించడం
ప్రారంభిస్తారు.
● అప్పుడు
మీరు సమృద్ధి
కోసం
భవిష్యత్తులో
ఎదురుచూడాల్సిన
అవసరమే ఉండదు
కదా! ఎందుకంటే
ఏ రూపాన్నైనా
(ఆరోగ్యం, సంపద, ప్రేమ, విజయాలను)
తక్షణమే
తీసుకోగల సర్వవ్యాపక
సమృద్ధి
శక్తితో
అనుసంధానమై
ఉన్నారు కనుక.
● అలాగే
మీరు సమస్త
కర్మబంధాల
వలయాల నుండి
ఒకేసారి
విముక్తి
పొందుతున్నారు.
● మీ
చైతన్యంలో
కలిగిన ఈ
పరివర్తన
మిమ్మల్ని వర్తమానంలో
సమృద్ధిని
ఆకర్షించే
అయస్కాంతంలా
తయారు చేస్తున్నది.
అలాగే ఇది
మిమ్మల్ని
అనంతమైన
సామర్ధ్యాలు, లోతైన
సంతృప్తిని
మరియు
బ్రహ్మానందాన్ని
కలిగిన
పరిపూర్ణ
జీవితాన్ని
అనుభవించే దిశగా
నడిపిస్తూ, పరమాత్మకి
చేరువ
చేస్తుంది.
జ్ఞానసూత్రాలు
1. "నేను
అనంతమైన
సమృద్ధి
యొక్క
అక్షయపాత్రను
- నేను
పూర్ణంగా
అపరిమితంగా మరియు
సమృద్ధిగా
ఉన్నాను. నా
గతం యొక్క
సమృద్ధి అనుభవాలు
నన్ను
అపరిమితమైన
సంపద, ప్రేమ
మరియు
ఆనందానికి
అయస్కాంతంగా
మార్చాయి. నా
గత అనుభవాలు
నా శక్తిని
పెంచాయి, ఇవి నా
సమృద్ధిని
అభివృద్ధి
పథంలో
నడిపించాయి.
2. "ప్రస్తుతం
నా చుట్టూ
ఉన్న ప్రతీ
దానికీ నేను
కృతజ్ఞతతో
అంగీకరిస్తున్నాను.
ఈ క్షణంలో నేను
అనంతమైన అవకాశాల
ఆనందాన్ని
అంగీకరిస్తూ,
నా ద్వారా అన్ని
వైపులా ప్రవహించే
సంపద యొక్క
ఉత్సాహాన్ని
స్వాగతిస్తున్నాను.
నేను ముందుకు ప్రవహిస్తున్నప్పుడు, సమృద్ధి
యొక్క అమృతం
నిరంతరం
ప్రబలంగా ఉంటూ, నా
జీవితంలోని
ప్రతి అంశంలో
అనంతమైన
ఆశీర్వాదాలను
తీసుకు వస్తుందని నాకు
తెలుసు." నా
భవిష్యత్తు
అన్ని
పరిమితులను
అధిగమించి, సమృద్ధి
యొక్క అనంత
శక్తితో
నిండి
ఉంటుంది."
3. "సమృద్ధి
ఎల్లప్పుడూ నాలోనే
ఉంది, మరియు
దాని నిరంతర ప్రవాహంలోకి
ప్రవేశించడం
నేను
నేర్చుకున్నాను.
ఈ క్షణంలో నేను
శక్తి, ఆరోగ్యం
మరియు సంపదను అన్ని
వైపులా ప్రసరింప
జేస్తున్నాను.
నేను స్వచ్ఛమైన
అచల శక్తి
యొక్క ఆనంద-ప్రవాహంతో
శృతి అయ్యి
ప్రవహిస్తున్నాను, మరియు
నేను ఇప్పుడు
సృష్టిస్తున్న
సమృద్ధి
జీవితం, నా
భవిష్యత్-జీవితాన్ని
సంపూర్ణ
సామరస్యంలో విదేహ
ముక్తిని వికసింప
జేస్తుందని
నేను
నమ్ముతున్నాను.
నేను వేసే
ప్రతి అడుగు
నా జీవితంలోని
ప్రతి
అంశంలోనూ
మరింత
ప్రశాంత
కదలికను
మరియు
ఉత్సాహాన్ని
అందిస్తుంది."
4. "నా
గతంలో నేను
పొందిన
సమృద్ధిని
నేను సెలబ్రేట్
చేసుకుంటాను.
ప్రతి సవాలు, విజయం
నన్ను విశ్వం
యొక్క
అనంతమైన
ప్రవాహంతో
మరింత
అనుసంధానం
చేయడానికి ఒక
అడుగు అని
నాకు తెలుసు.
దైవిక శక్తి
నాలో
ప్రవహిస్తున్నట్లు
నేను ఇప్పుడు అనుభూతి
చెందుతున్నాను.
అది నా
ఆరోగ్యం, సంపద, ప్రేమను
పెంచుతోంది.
నేను
భవిష్యత్తులోకి
వెళ్తున్నప్పుడు, ఈ
ఆనందకరమైన
శక్తిని నేను
నా వెంట తీసుకు
వెళ్తున్నాను. మరింత ఉత్సాహకరమైన
విషయాలు ముందున్నాయని, అవి
జరగడానికి
సిద్ధంగా
ఉన్నాయని
నాకు తెలుసు."
5. "
నేను ఇప్పుడు
పొందుతున్న
సమృద్ధికి నా
గతం అనేది చక్కటి
ఆధారంగా ఉంది.
నేను ఈ
క్షణంలో ఉండి, ఈ
శక్తివంతమైన
క్షణం యొక్క
ఆనందంలో
పూర్తిగా
లీనమై ఉన్నాను.
సంపద, ఆరోగ్యం, మరియు
ఆనందంతో
కూడిన
సమృద్ధి అనేది
నా జన్మహక్కు అని నాకు
తెలుసు. నేను
సులభంగా
అంతులేని
ఆనందపు భవిష్యత్తును
సృష్టిస్తాను.
అక్కడ సమృద్ధి
నాలో
స్వేచ్ఛగా (ఏ
షరతులు, పరిమితులు,
అర్హతలు
లేకుండా)
ప్రవహిస్తుంది.
నేను విశ్వం
యొక్క జ్ఞానామృతానికి
నిరంతర వాహికను."
6. "సమృద్ధి
నా సహజమైన
స్థితి. ఇది కాలాతీతమైనది, ఎప్పటికీ
వున్నది, మరియు
ఎల్లప్పుడూ
అందుబాటులో
ఉండేది. నేను
నా గతం యొక్క
సమృద్ధిని
అంగీకరిస్తున్నాను, ప్రతి
అనుభవం నన్ను
ఈ ఆనందం మరియు
ప్రవాహం యొక్క
ఖచ్చితమైన
క్షణానికి
నడిపించిందని
తెలుసుకుంటున్నాను.
ఇప్పుడు, నేను
ఆరోగ్యం, సంపద
మరియు
ప్రేమతో పొంగిపొర్లుతున్నాను, మరియు
నా
భవిష్యత్తు
ఎప్పటికప్పుడు
విస్తరించే
ఉత్సాహం
మరియు
అనంతమైన
అవకాశాలతో నిండి
ఉందని నాకు
తెలుసు."
7. "విశ్వం
ఎప్పుడూ నాకు కావలసినదంతా
అందించింది, అలాగే
నేను ఇలా మారడానికి
నా గతంలో
అనుభవించిన సమృద్ధికి
కృతజ్ఞతలు
తెలుపుతున్నాను.
ఈ ప్రస్తుత
క్షణంలో, విశ్వం
యొక్క శుద్ధ
శక్తితో శృతిలో
ఉంటూ, సంపద
మరియు అచలానందాన్ని
నేను అన్నివైపులా
ప్రసరిస్తున్నాను.
నా
భవిష్యత్తు
ఇప్పటికే
ఆనందం మరియు
అపరిమితమైన
సామర్థ్యంతో
నిండి ఉందని
నేను నమ్ముతున్నాను, సమృద్ధి
యొక్క శక్తి
నా
జీవితంలోని
ప్రతి రంగంలో
సులభంగా
ప్రవహిస్తుంది."
8. "నేను
విశ్వం యొక్క ఆనందోత్సాహంతో
సదా శృతిలో ఉన్నాను, ఇక్కడ
సమృద్ధి నా
ద్వారా
అంతరాయం
లేకుండా అన్నివైపులా
ప్రవహిస్తుంది.
నా గతం ఒక అభివృద్ధి
యాత్ర, ప్రతి
అనుభవం నన్ను
ఈ ఆనంద
క్షణానికి చేరువ
చేసింది.
ప్రస్తుతం, నేను
సంపద, ఆరోగ్యం
మరియు
ప్రేమతో
పొంగిపొర్లుతున్నాను.
నా
భవిష్యత్తు
ఇప్పటికే పరమాత్మ
యొక్క
ఆశీర్వచనాలు
మరియు ఆనంద
కాంతి అణువులతో
నిండిన అక్షయపాత్రగా
ఉందని నాకు
తెలుసు."
9. "నేను
గతం, వర్తమానం, భవిష్యత్తు
మూడు కాలాలలో
సమృద్ధి
శక్తితో అనుసంధానమై
ఉన్నాను. నా
గతం నాకు
శక్తిని
అందించింది, నా
వర్తమానంలో
నా జీవితం
సమృద్ధితో
నిండి ఉంది, మరియు
నా
భవిష్యత్తు
నిరంతర
విజయాలు
మరియు ఆనందంతో
నిండి
ఉంటుంది. ఈ
శాశ్వత
సమృద్ధి ప్రవాహంతో, నేను
ప్రతీ క్షణం
ఆనందాన్ని, ఆరోగ్యం, సంపద
మరియు విజయం
పొందుతున్నాను."