Everybody has to take a long deep breath,
those who have breath to live.

ధ్యానం చేసే విధానం

సుఖాసనంలో కూర్చుని లేదా పడుకుని, కళ్ళు రెండూ మూసుకుని, సహజంగా జరుగుతున్న “ఉచ్ఛ్వాస-నిశ్వాస”లను మీరు ప్రశాంతంగా హాయిగా నిశ్చలంగా ఉంటు గమనించండి. ఆలోచనలు వస్తున్నా వాటితో మీరు చురుకుగా పాల్గొనకుండా, కేవలం వాటిని గమనిస్తూనే శ్వాస మీద ధ్యాస పెట్టండి.

1) ఇలా గమనిస్తూ ఉంటే శ్వాస క్రమ క్రమంగా చిన్నదవుతూ భ్రూమధ్యంలో అంటే మూడవ కన్ను వద్దకు తనంతట తాను సహజంగా చేరుకుని ఆగిపోతుంది. అప్పుడు ఆలోచనా రహిత స్థితి సహజంగా లభిస్తుంది.

2) దీని వలన ఇక్కడే అనంతంగా ఉన్న న్యూ ఎనర్జీ మీలోకి ప్రవేశిస్తుంది. అలాగే మీకు ఆత్మ జ్ఞానం కూడా లభిస్తుంది. న్యూ ఎనర్జీ సహాయంతో జ్ఞానాన్ని ఆచరిస్తే, ఆలోచనలతో సహా మీలోని భాగాలన్నీ ఎదిగి దివ్యమైన శక్తులుగా పరివర్తన చెందుతాయి.

3) అలాగే దైవంతో మిమ్మల్ని కలిపే సామర్ధ్యం న్యూ ఎనర్జీకి ఉండడం వలన, మీరు దివ్య-మానవుడిగా పరివర్తన చెంది ఆనంద స్థితిలో ఉండిపోతారు.

4) ఈ ధ్యానాన్ని ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, ఎంత సమయమైనా చేసుకోవచ్చు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా ధ్యానం చేయండి.

5) అలాగే మీరు ఏ పని చేస్తున్నా, ఆ పనిని శ్వాస మీద ధ్యాస పెడుతూ చేయండి. ఇలా పనిని మరియు ధ్యానాన్ని కలిపి చేయడం వలన ఆ పనులలో కూడా సృజనాత్మకత నెలకొంటుంది. దీని వలన ఆ పనులను ప్రశాంతంగా, సరదాగా, ఆడుతూ-పాడుతూ, ఎలాంటి అలజడి లేకుండా చేయగలుగుతారు.

HOW ONE SHOULD MEDITATE

Sit or lay down in a comfortable posture, as you feel convenient. Close your eyes, start observing your inhalation-exhalation. Even thoughts are arriving, without actively participating with them, just observe both thoughts and breathe simultaneously.

1) If you observe like this, breath himself becomes smaller and stops at third eye point naturally. Then you will get thoughtless state naturally.

2) Because of this, infinite new energy which is present here and now enters within you. And also you attain soul knowledge. If you start implementing this knowledge with the help of new energy, all your parts and thoughts develops and transforms into divine energies.

3) Since new energy has the ability to integrate you with divine, you will transform into divine-human and remain in blissful state.

4) Anytime, anyplace, anywhere you can practice this meditation. Start practicing meditation for at least 30 minutes daily.

5) Whatever you do daily, do those works besides observing your natural breathe. This blend of daily work and meditation increases the creativity in your daily work. You will start noticing that you would be able to do your daily work without tension, with peaceful and Joyful manner.